Rajini–Kamal: రజినీ–కమల్ మూవీ అప్డేట్.. రూ.600 కోట్ల మెగా మల్టీస్టారర్‌కు శ్రీకారం

Rajini–Kamal: రజినీ–కమల్ మూవీ అప్డేట్.. రూ.600 కోట్ల మెగా మల్టీస్టారర్‌కు శ్రీకారం

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవాలుగా నిలిచిన రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్‌పై భారీ అప్డేట్ వచ్చింది. దాదాపు 46 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ మళ్లీ ఒకే సినిమాలో నటించనున్నారు.

రజినీతో ‘జైలర్’ వంటి బ్లాక్‌బస్టర్ అందించిన నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మల్టీస్టారర్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. లేటెస్ట్గా (2026 ఫిబ్రవరి 8న) ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనను మేకర్స్ విడుదల చేశారు.

ఇద్దరు దిగ్గజాలను కలిపి రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేస్తూ, “కొంతమంది నియమాలను నిర్దేశిస్తారు..మరికొంతమంది న్యాయంగా పాలిస్తారు” అనే ట్యాగ్‌ను జత చేశారు. అలాగే రేపు మధ్యాహ్నం 12:07 గంటలకు సినిమా ప్రోమో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ALSO READ :  స్పీడ్ అందుకున్న రష్మిక–విజయ్ పెళ్లి ఏర్పాట్లు..

ఇటీవల ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, చివరికి ‘జైలర్’ ఫేమ్ నెల్సన్‌కే బాధ్యతలు అప్పగించారు. ఈ చిత్రాన్ని లైట్ హార్టెడ్ యాక్షన్ కామెడీ డ్రామాగా రూపొందించనున్నట్లు సమాచారం. సుమారు రూ.600 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ రెమ్యునరేషన్ మాత్రమే రూ.225 కోట్ల వరకు ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. రెడ్ జాయింట్ పిక్చర్స్తో పాటుగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యం వహించనున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుండగా, 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 1981లో వచ్చిన `తిల్లు ముల్లు` తర్వాత రజినీ–కమల్ కలిసి పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

ALSO READ : ‘ఇన్ స్టాగ్రామ్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు ?’