హైదరాబాద్: యూట్యూబర్ అన్వేష్ మరోసారి హాట్ కామెంట్స్ చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి..? పోతే ఏంటి..? అంటూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశాడు. తన ఇన్ స్టాగ్రామ్ పోతే బాధపడతా అనుకున్నారా బత్తాయిలు అంటూ కామెంట్ చేశాడు. ‘‘రెండు ఇన్ స్టాగ్రాములు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానళ్లు.. నా రెండు కాళ్లు, నా ఫేస్ బుక్ నా శరీరం భాగం .. ఈ ఐదు భాగాలని నడిపించేది నా తెలివైన బుర్ర... తెలివైన బుర్ర ఉంది కాబట్టే ఎంతో మందిని నిద్రలేకుండా చేస్తున్న..
ఒక చెయ్యి లాంటి నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ పోయిన మరొక చెయ్యి లాంటి ఇంస్టాగ్రామ్ ఉంది.. మరొక instagramని తీసేసిన మిగిలిన భాగాలైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్తో ముందుకు పోతాను.. చివరికి నా తలతో అయినా మాట్లాడి ముందుకు వెళ్తాను.. నేను దొరికితే డైరెక్ట్గా నా తల నరికేయాలి.. నేను ఎవరిని దేకను, నేను ఎలాంటి మోసాలు చేయలేదు.. నాకు ఫాలోవర్స్ ఉంటే ఏంటి.. పోతే ఏంటి..? నిద్ర పట్టనివ్వను,ఎవరిని వదలను’ అని అన్వేష్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి దారితీశాయి.
