హైదరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే ఘట్ కేసర్ లో తల్లితో పాటు ఇద్దరు పిల్లలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఫిబ్రవరి 24న అంబర్ పేట లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు.
మొదటగా భార్య సూసైడ్ చేసుకోగా తర్వాత భర్త రామరాజు ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోయాడని ఆ తర్వాత కొడుకు శశాంక్ చేతిని కత్తితో కోసుకుని తీవ్ర రక్తంతో చనిపోయాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సికింద్రాబాద్ అడిషనల్ డీసీపీ నరసయ్య తెలిపారు. మృతులు రామ్ రాజ్(55 ), మాధవి (50 ), శశాంక్ (24) గా గుర్తించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
జనవరి 31న ఉదయం చర్లపల్లి- ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఎలాంటి ఇబ్బందులు లేకున్నా డిప్రేషన్,ఒంటరితనంతో ఫ్యామిలీ ఆత్మహత్యచేసుకోవడం విషాదాన్ని నింపింది.
