ఖమ్మం: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. జిల్లాలోని పెనుబల్లి మండలం తుమ్మలపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. విజయవాడ-ఛత్తీస్‌గఢ్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులను ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎడవల్లికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా వ్యాపారం నిమిత్తం విజయవాడ వైపు నుంచి ఒడిశాకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం చింతోనిగంపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, జి.సురేష్ (22) అనే యువకుడు మరణించాడు. బైక్ అదుపుతప్పి , దానిపై నుండి కింద పడటంతో అక్కడికక్కడే మరణించాడు
