సాగర్‌‌కు 3.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో

సాగర్‌‌కు 3.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో

హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తోంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్ట్‌‌ నుంచి 3,25,602 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండడంతో సాగర్‌‌ వద్ద నీటి విడుదల కొనసాగుతోంది. సాగర్‌‌ రిజర్వాయర్‌‌ 16 గేట్లను ఐదు అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,70,938 క్యూసెక్కులను నీటిని విడుదల చేస్తున్నారు. 

నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 587. 60 అడుగులు( 305. 8626  టీఎంసీల) నీరు నిల్వ ఉంది. సాగర్‌‌ నుంచి ఎడమకాల్వకు 8,807 క్యూసెక్కులు, కుడి కాల్వకు 9,500, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాల్వకు 300, విద్యుత్‌‌ ఉత్పత్తికి 33,657 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.