వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

వ్యాక్సిన్ తర్వాత 30 నిమిషాలు అక్కడే రెస్ట్‌‌.. రియాక్షన్స్‌‌ వస్తే వెంటనే ట్రీట్‌‌మెంట్

గుర్తింపు కార్డు ఉంటేనే సెంటర్‌‌లోకి ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు: ప్రయార్టీ లిస్టు ప్రకారం ముందుగా కొవిన్​ పోర్టల్​, యాప్​లో రిజిస్టర్​ చేసుకున్నోళ్లకే వ్యాక్సిన్​ వేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డు చూపిస్తేనే వ్యాక్సినేషన్‌‌ సెంటర్‌‌‌‌లోకి అడుగు పెట్టనిస్తారు. ఏ సెంటర్‌‌‌‌లో, ఏ సమయానికి వ్యాక్సిన్ వేస్తారో ముందు రోజే మొబైల్‌‌కు మెసేజ్ వస్తుంది. ఆ సమయానికి ఆధార్‌‌‌‌ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని సెంటర్‌‌‌‌కు వెళ్లాలి. గుర్తింపు కార్డు లేకుంటే సెంటర్‌‌‌‌లోకి రానివ్వరు.

ఇలా చేయాలి..!

ప్రభుత్వం సూచించిన ప్రయార్టీ లిస్టు ప్రకారం కొవిన్​ పోర్టల్​ లేదా యాప్​లో పేరు నమోదు చేసుకోవాలి.

    ఏ సెంటర్​లో మనకు వ్యాక్సిన్​ వేస్తారో ‘కొవిన్’ నుంచి బెనిఫిషియరీకి సమాచారం అందుతుంది. దాని ప్రకారం సెంటర్​కు వెళ్లాలి.

    ఏదైనా ఒక గుర్తింపు కార్డు(ఆధార్‌‌‌‌, పాన్‌‌, డ్రైవింగ్ లైసెన్స్‌‌, ఓటర్ కార్డు వంటివి) తీసుకుని వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌కు వెళ్లాలి.

    వ్యాక్సినేషన్ ఆఫీసర్‌‌‌‌గా ఉన్న పోలీస్‌‌ సిబ్బందికి ఆ కార్డు చూపించి, ఆయన సూచించిన చోట వెయిట్ చేయాలి.

    ఆ తర్వాత మరో ఆఫీసర్ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్​ చేసుకున్నట్టు వచ్చిన ఎస్‌‌ఎంఎస్‌‌, గుర్తింపు కార్డు చూపించాలి.

    ఈ ఆఫీసర్లు కొవిన్‌‌ వెబ్‌‌సైట్‌‌లో రిజిస్ట్రేషన్ వివరాలు వెరిఫై చేసి, వెయిటింగ్ హాల్‌‌కు పంపిస్తారు. మీ వంతు వచ్చే వరకూ అక్కడే వెయిట్ చేయాలి.

    ఆ తర్వాత వ్యాక్సిన్ వేసి, ఎడమ చేతి బొటన వేలుకు సిరా పూస్తారు. 

వ్యాక్సిన్ వేసుకున్నాక, అరగంట పాటు అక్కడే వెయిట్ చేయాలి. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడున్న డాక్టర్‌‌‌‌కు చెప్పాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక వ్యాక్సిన్ వేసుకున్నట్టు కొవిన్ పోర్టల్‌‌ నుంచి డౌన్‌‌లోడ్ చేసిన ఓ కార్డు ఇస్తారు. అలాగే, వ్యాక్సిన్​తీసుకున్నోళ్ల మొబైల్‌‌కు కూడా ఎస్‌‌ఎంఎస్ రూపంలో ఓ లింక్ వస్తుంది. ఇందులో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, అడ్రస్‌‌, వ్యాక్సినేషన్ సెంటర్‌‌‌‌, వ్యాక్సిన్ బ్యాచ్ నంబర్‌‌‌‌ వంటివన్నీ ఉంటాయి. సెకండ్ డోస్ వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారు? ఎక్కడ వేస్తారు? వంటి సమాచారం కూడా ఉంటుంది. సెకండ్‌‌ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ కార్డు తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది.

రియాక్షన్స్ వస్తే ఇలా చేయండి

వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు నొప్పి, దురద, వాపు, ఎర్రబారడం, అలసట, తలనొప్పి, జ్వరం వంటి రియాక్షన్స్​ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. వ్యాక్సినేషన్​ సెంటర్​లోనే ట్రీట్‌‌మెంట్ అందిస్తారు. వందలో ఒకరికి మత్తెక్కడం, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి తగ్గడం, విపరీతంగా చెమట రావడం, చర్మంపై ర్యాషెస్ రావడం వంటివి జరగొచ్చు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి. వెంటనే డాక్టర్‌‌‌‌కు తెలపాలి. ఇంటికి వెళ్లిన తర్వాత ఇలాంటి రియాక్షన్‌‌ వస్తే 104, 108 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలి.

For More News..

నేడు 4,200 మందికి వ్యాక్సిన్.. వారంలో నాలుగు రోజులు మాత్రమే వ్యాక్సినేషన్

వరస్ట్​ సీఎంలలో కేసీఆర్‌కు 4వ ప్లేస్‌