- అధికారులకు సీఎస్ రామకృష్ణారావు ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సాగు లెక్కలు పక్కాగా ఉండాలని, డిజిటల్ క్రాప్ సర్వే (డీసీఎస్) ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్‌లో డిజిటల్ క్రాప్ సర్వేపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మార్చి 15వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఆలోగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే పనులన్నీ పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు.
