రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఐదేళ్లలో 3055 మంది రైతుల ఆత్మహత్య

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలను కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఐదేళ్లలో రాష్ట్రంలో 3,055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం  2017 – 2021 వరకు 3055 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. 2018, 2019లో ఎక్కువ మంది రైతులు సూసైడ్స్ చేసుకున్నారన్నారు. 2017లో 846, 2018లో 900, 2019లో 491, 2020లో 466, 2021లో 352 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వివరించారు. ఏపీలో 2413 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. యూపీలో 398 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఇక గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 28,572 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.