
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ పరిధిలో మరో 326 ఆర్టీసీ బస్సులు రానున్నాయి. జిల్లాల్లోని పల్లె వెలుగు బస్సులు సిటీలో నడిపేందుకు ఆర్టీసీ మేనేజ్మెంట్అనుమతినిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మరో వైపు కొత్త బస్సులకు పైసల్లేక ఉన్న అద్దె బస్సులనే ఏడాదిపాటు పొడిగించారు. అయితే సిటీలో 15ఏండ్లలోపు కాలపరిమితి బస్సులనే అనుమతిస్తుండడంతో వాటినే సెలెక్ట్ చేశారు. పల్లె వెలుగు బస్సులను అలాగే వాడుకోవడానికి వీలుండదు. వీటిని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్లలో మాడిఫై చేసి, వీలైనంత త్వరగా అందుబాటులోకి తేనున్నారు. ఆర్టీసీలో అద్దె బస్సుల గడువు పొడిగించారు. 300 వరకు బస్సులకు ఇటీవల గడువు ముగిసింది. సంస్థలో ఆర్థిక నష్టాలు, అప్పుల నేపథ్యంలో కొత్త బస్సులను కొనే పరిస్థితి లేదు. దీంతో వీటినే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చార్జీలు మాత్రం కాస్త తక్కువగా చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.