గచ్చిబౌలిలో గాలివానకు హైవేపై ఒరిగిన 33 కేవీ విద్యుత్​ స్తంభాలు

గచ్చిబౌలిలో గాలివానకు హైవేపై ఒరిగిన 33 కేవీ విద్యుత్​ స్తంభాలు

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​పరిధిలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. గోపన్​పల్లి తండా రోడ్డు పక్కన ఉన్న రెండు 33 కేవీ విద్యుత్​స్తంభాలు రోడ్డుపైకి ఒరిగాయి. వాహనదారులు భయంభయంగా ఇటుగా ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు కరెంట్​సరఫరాను నిలిపివేశారు. గోపన్​పల్లి, నానాక్​రాంగూడ సబ్​స్టేషన్స్​పరిధిలో గంటల పాటు అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ విధానంలో విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించారు. 

గచ్చిబౌలి మెయిన్​లేన్ నుంచి గోపన్​పల్లి మీదుగా నానాక్​రాంగూడ ఐటీ ఏరియాకు ఈ లైన్​ద్వారానే 33 కేవీ విద్యుత్​సరఫరా జరుగుతుంది. ఒరిగిన స్తంభాలను సరిచేసే పనులు కొనసాగుతున్నాయి.