సీఎం ప్రజావాణికి 341 దరఖాస్తులు

సీఎం ప్రజావాణికి  341 దరఖాస్తులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్​లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి 341 దరఖాస్తులు అందాయి. సీఎం ప్రజావాణి ఇన్​చార్జ్ చిన్నారెడ్డి, రాష్ట్ర నోడల్ అధికారి దివ్య దేవరాజన్ దరఖాస్తులు స్వీకరించారు. అధికారులతో చిన్నారెడ్డి ఫోన్​లో మాట్లాడి పలు సమస్యలను పరిష్కరించారు. కాగా..  ప్రైవేట్ పోర్టర్ దోపిడీని అరికట్టాలని కోరుతూ ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ వినతిపత్రాన్ని అందజేశారు. 

డీజిల్ ధరలు పెరిగినా రవాణా చార్జీలు పెంచకుండా శ్రమదోపిడీ చేస్తున్న ప్రైవేట్ పోర్టర్ స్థానంలో ప్రభుత్వమే ట్రాన్స్ పోర్ట్ యాప్​ను ఏర్పాటు చేయాలని, గిగ్ వర్కర్స్ లాగా గుర్తించాలని కోరారు.