ఇజ్రాయెల్‌లో రాకెట్ దాడి.. 35 మంది మృతి

ఇజ్రాయెల్‌లో రాకెట్ దాడి.. 35 మంది మృతి

ఇజ్రాయెల్‌, గాజాలలో దారుణ రాకెట్ దాడులు జరిగాయి. ఈ దాడిలో దాదాపు 35 మంది చనిపోయినట్లు అధికారవర్గాలు తెలిపాయి. గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు చేశారు. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. హమాస్ దాడులకు ప్రతిదాడులుగా బుధవారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు గాజాపై రాకెట్ల దాడి చేశాయి. ఈ దాడిలో గాజాలోని ఒక బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. దాంతో దాని పక్కనే ఉన్న మరో భవనం భారీగా దెబ్బతింది. ఈ ఘటనలో  28 మంది చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. ఇస్లామిస్ట్ గ్రూప్ మరియు ఇతర పాలస్తీనా ఉగ్రవాదులు గాజాలోని టెల్ అవీవ్ మరియు బీర్షెబా వద్ద రాకెట్ బాంబులను ప్రయోగించారు.

బుధవారం తెల్లవారుజామున పలువురు హమాస్ ఇంటెలిజెన్స్ నాయకులను లక్ష్యంగా చేసుకుని తమ జెట్‌లు దాడులు చేశాయని ఇజ్రాయెల్ తెలిపింది. హమాస్ కార్యాలయాలు మరియు హమాస్ నాయకుల ఇండ్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని మిలటరీ చెప్పింది.

గాజాలో 2014లో జరిగిన యుద్ధం తరువాత ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య జరిగిన అతి పెద్ద దాడి ఇది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే పరిస్థితి అదుపుతప్పుతుందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.