రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడి.. పలువురి మృతి..

రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడి.. పలువురి మృతి..

ఉక్రెయిన్లోని క్రామాటోర్స్క్ సిటీ రైల్వే స్టేషన్పై రష్యా సైన్యం రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 35 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్ పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో ఈ దాడులు చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ఒకేసారి రెండు రాకెట్లతో దాడి జరిగినట్లు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఉక్రెయిన్ ఆర్మీ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు ప్రారంభించారు. బాంబు దాడిలో తీవ్రంగా గాయపడ్డ వారిని దగ్గరలోని హాస్పిటళ్లకు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. 

రైల్వే స్టేషన్పై దాడికి సంబంధించి రష్యా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతుండగా.. కేవలం ఆర్మీ, ప్రభుత్వ కార్యాలయాలే తమ లక్ష్యమని ప్రకటించింది. అయితే ఆ మాట నిలబెట్టుకోని రష్యా.. పౌరులపై కూడా దాడులకు తెగబడుతోంది. 

మరిన్ని వార్తల కోసం..

కమీషన్ల కోసమే బాయిల్డ్ రైస్ పంచాయతీ

‘ప్రజా సంగ్రామ యాత్ర’కు అనుమతివ్వండి