వానాకాలం సాగు 43.31లక్షల ఎకరాలు

వానాకాలం సాగు 43.31లక్షల ఎకరాలు
  • ప్రధానంగా సాగు చేస్తున్న పంటలు ‌‌– పత్తి, కంది, సోయాబీన్, వరి
  • ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 104  శాతం పంటల సాగు
  • వనపర్తి జిల్లాలో  కేవలం 6 శాతమే నమోదు
  • రాష్ట్ర సర్కారుకు వ్యవసాయ శాఖ నివేదిక

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని రైతన్నలు పంటల సాగుపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకూ 27 జిల్లాల్లో మొత్తం 43.31లక్షలకు పైగా ఎకరాల్లో అన్నదాతలు పంటలు వేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ బుధవారం.. ప్రభుత్వానికి నివేదికను అందించింది. 31.87 లక్షల ఎకరాల్లో కాటన్‌‌‌‌‌‌‌‌ సాగు జరిగినట్లు తాజా నివేదికలో వెల్లడయింది.  ఈ ఏడాది వానాకాలం 70లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని సర్కారు టార్గెట్‌‌‌‌‌‌‌‌పెట్టగా..ప్రస్తుతం 45శాతానికి లక్ష్యం చేరుకుంది. కంది 15 లక్షల ఎకరాల్లో వేయాలని  టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోగా..ఇప్పటివరకు 2.72 లక్షల ఎకరాల్లో వేసినట్లు రిపోర్టు వెల్లడించింది. సోయాబీన్‌‌‌‌‌‌‌‌ సాధారణ సాగు లక్ష్యం 3.88 లక్షల ఎకరాలు కాగా.. ప్రస్తుతం 3.01(78శాతం)లక్షల ఎకరాల్లో పంట వేశారు. వరి టార్గెట్‌‌‌‌‌‌‌‌ 45 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 1.31లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. ఇక మక్కలు 1.61లక్షల ఎకరాలు, పెసలు 31వేల ఎకరాలు, మినుములు 16వేల ఎకరాలు, జొన్నలు 12వేల ఎకరాలు, ఇతర పంటలు 2.36లక్షల ఎకరాల్లో ప్రస్తుతం సాగు అవుతోన్నట్లు  నివేదిక స్పష్టం చేసింది. 

రాష్ట్ర వ్యాప్తంగా 35శాతం పంటల సాగు..
ఈ ఏడాది వానాకాలంలో 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ టార్గెట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 35శాతమే పంటలు సాగవుతున్నాయి. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో సాధారణ సాగు 5.23 లక్షలు కాగా.. అనుకున్న దానికంటే ఎక్కువగా 5.43లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. సంగారెడ్డిలో 5 లక్షలు, కుమ్రంభీమ్‌‌‌‌‌‌‌‌ ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 2.68 లక్షలు, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో 2.54 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తున్నట్లు రిపోర్ట్ వివరించింది. అత్యంత తక్కువగా మేడ్చల్‌‌‌‌‌‌‌‌ మల్కాజ్గిరిలో 2140 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగైనట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో పత్తి పంట సాధారణ సాగు 3.75లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 3.97 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. 

కేవలం 6 జిల్లాల్లో నే అధికంగా సాగు 
ఇప్పటి వరకు కేవలం ఆరు జిల్లాల్లోనే 50 శాతానికి పైగా పంటల సాగు నమోదయ్యిందని అధికారులు చెప్పారు. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ 104 శాతం, సంగారెడ్డిలో  76 శాతం, కుమ్రంభీమ్‌‌‌‌‌‌‌‌73 శాతం,  సంగారెడ్డి, జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లిలో 51శాతం పంటలు సాగవుతుండగా.. మిగాతా 25 జిల్లాల్లో రైతులు 50శాతం లోపే పంటలు సాగుచేస్తున్నారని వెల్లడించారు. వనపర్తి జిల్లాలో  6 శాతం, సూర్యపేట జిల్లాలో 14శాతం , యాదాద్రి జిల్లాలో 20 శాతం పంటల సాగు నమోదైందని పేర్కొన్నారు.