ఒకే స్కూల్‌లో 35 మంది అమ్మాయిలకు కరోనా పాజిటివ్

ఒకే స్కూల్‌లో 35 మంది అమ్మాయిలకు కరోనా పాజిటివ్

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 35 మంది పిల్లలకు కరోనా సోకింది. పూంచ్‌ జిల్లాలోని మండీ గ్రామంలో గాల్స్ హైస్కూల్‌లో మొదట ఒక అమ్మాయికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేశారు. ఆ స్టూడెంట్‌కు పాజిటివ్ రావడంతో స్కూల్‌లో అందరికీ టెస్టులు చేశామని మండీ తహసీల్దార్‌‌ షాజద్‌ లతీఫ్ ఖాన్‌ తెలిపారు. స్కూల్‌లో మొత్తం 35 మంది అమ్మాయిలకు పాజిటివ్ వచ్చిందని చెప్పారు. దీంతో స్కూల్‌ను ఐదు రోజుల పాటు మూసేయాలని నిర్ణయించామని అన్నారు. అప్పటి వరకూ మిగిలిన పిల్లలను కూడా ఇంట్లో క్వారంటైన్‌లో ఉంచాల్సిందిగా సూచించామని చెప్పారు. కరోనా రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని, ఐదు రోజుల తర్వాత ఎవరికైనా సింప్టమ్స్ కనిపిస్తే టెస్టులు చేశాక మళ్లీ క్లాసులు మొదలుపెడతామని లతీఫ్ వెల్లడించారు.

మరిన్ని వార్తల కోసం..

ఈమె నోరు విప్పడం వల్లే ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఆగిపోయాయా?

ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్.. ఏం కనిపెట్టారంటే?

జగిత్యాల: చనిపోయిన రోగికి సీరియస్‎గా ఉందంటూ మరో ఆస్పత్రికి..