
చనిపోయిన రోగికి సీరియస్‌గా ఉందంటూ అంబులెన్స్‌లోకి ఎక్కించి వేరే ఆసుపత్రికి పంపించే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ వెలుగుచూసింది. కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లికి చెందిన మంజుల అనే మహిళ జ్వరంతో బాధపడుతూ కోరుట్లలోని సాహితి హాస్పిటల్లో నిన్న మధ్యాహ్నం చేరింది. పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయింది. అయితే మంజుల పరిస్థితి సీరియస్‌గా ఉందంటూ అంబులెన్స్‌లో ఎక్కించి వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని హాస్పిటల్ నిర్వాహకులు ఆమె కుటుంబ సభ్యులతో చెప్పారు . అనుమానం వచ్చిన మంజు భర్త లింగారెడ్డి, బంధువులు దగ్గరికి వెళ్లి చూసే సరికి ఆమె చనిపోయింది. దీంతో మంజుల కుటుంబసభ్యులు, బంధువులు.. అంబులెన్స్‌ను హాస్పిటల్ గేటు దగ్గర ఆపేసి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మంజుల చనిపోయిందని హాస్పిటల్ ఫర్నీచర్ ద్వంసం చేశారు. హాస్పిటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో డెబ్ బాడీని అక్కడినుంచి తీసుకెళ్లారు.