టెన్త్ క్వాలిఫికేషన్ తో నేవీలో ఉద్యోగాలు

టెన్త్ క్వాలిఫికేషన్ తో నేవీలో ఉద్యోగాలు

భారత నావికా దళం పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి అర్హతతో ఉద్యోగాలను కల్పించనుంది. ఈ పోస్టులకు అవివాహిత పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 
ఖాళీలు, అర్హతలు:
మొత్తం 350 ఖాళీల్లో చెఫ్‌, హైజీనిస్ట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించడంతోపాటు ఇండియన్‌ నేవీ నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఏజ్ లిమిట్: అభ్యర్థులు ఏప్రిల్‌ 1, 2001 నుంచి సెప్టెంబర్‌ 30, 2004 మధ్య జన్మించి ఉండాలి.
సాలరీ:  పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 స్టైపెండ్‌గా చెల్లిస్తారు.  ఆ తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న వారికి విభాగాలను అనుసరించి రూ. 21,700 నుంచి 69,100 జీతంగా చెల్లిస్తారు.
పరీక్ష నిర్వహణ:  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందూలోనూ అర్హత సాధించిన వారికి మెడికల్‌ పరీక్ష నిర్వహించి శిక్షణకు పంపుతారు. రాత పరీక్షను హిందీ, ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ఈ ఎగ్జామ్‌ సైన్స్‌ అండ్‌ మ్యాథమెటిక్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల్లో ఉంటుంది. మెడికల్‌ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థి 7 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగు పూర్తి చేయాలి. 20 స్క్వాట్స్‌, 10 పుష్ అప్స్ చేయాల్సి ఉంటుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 12వ వారాల పాటు శిక్షణ ఇస్తారు. తర్వాత బ్రాంచి/ట్రేడ్‌ల వారీగా విధుల్లోకి తీసుకుంటారు.
దరఖాస్తు చివరి తేదీ: ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జులై 19, 2021న మొదలై జులై 23, 2021న ముగియనుంది.
వెబ్ సైట్: https://www.joinindiannavy.gov.in/