
- విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్ మిట్టల్.. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్.శ్రీధర్
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు
- ఐ అండ్ పీఆర్ స్పెషల్ సెక్రటరీగా సీహెచ్ ప్రియాంక
- టీజీపీఎస్సీ సెక్రటరీగా ప్రియాంక అల
- హైదరాబాద్ కలెక్టర్‌గా హరిచందన
హైదరాబాద్, వెలుగు: భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఒకేసారి 36 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ గురువారం (June 13) ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలువురు ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. ఆరోపణలు, పనితీరు మెరుగు పడని కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. 2023 జనవరి నుంచి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న నవీన్ మిట్టల్‌ను ఆ శాఖ నుంచి ప్రభుత్వం తొలగించి.. విద్యుత్ శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.
రెవెన్యూ సెక్రటరీగా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ కార్యదర్శిగా లోకేశ్ కుమార్‌కు అవకాశం ఇచ్చింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అదనపు బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించింది. ఇక పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, ఆర్ డబ్ల్యూఎస్ అండ్ ఆర్ఎస్ఏడీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్. శ్రీధర్ బదిలీ అయ్యారు. ఆయన మైనింగ్ శాఖ బాధ్యతలు కూడా చూడనున్నారు. జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శిగా నియమించారు. అదనంగా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్ డీజీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఎవరెవరు.. ఎక్కడికి?
ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రెసిడెంట్ కమిషనర్‌గా డాక్టర్ శశాంక్ గోయల్. ఈ స్థానంలో ఉన్న గౌరవ్ ఉప్పల్ కో ఆర్డినేషన్ (కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ) కార్యదర్శిగా నియమితులయ్యారు.
నిజామాబాద్ కలెక్టర్‌గా ఉన్న రాజీవ్‌గాంధీ హనుమంతు రెవెన్యూ (రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్) స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు. ఆయన అదనంగా కమిషనర్ అండ్ ఐజీ , రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్ బాధ్యతలను కూడా చూస్తారు.
- వాసం వెంకటేశ్వర్ రెడ్డి యూత్ సర్వీసెస్ డైరెక్టర్ నుంచి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
- సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతిని తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
- ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం కలెక్టర్ స్థానం నుంచి సివిల్ సప్లయీస్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
- ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా పి.ఉదయ్ కుమార్.
- తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సెక్రటరీగా ప్రియాంక అలా.
- తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా ఏ నిర్మల కాంతి వెస్లీ.
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా డాక్టర్ ఇ.నవీన్ నికోలస్.
- ఎంఏ అండ్ యూడీ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న ప్రియాంకను ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా నియమించారు.
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్‌గా చహత్ బజ్‌పాయ్ బదిలీ.
- ఆశ్వినీ తానాజీ వకడేకు కరీంనగర్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పోస్ట్.
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా ప్రఫుల్ దేశాయ్.
- బి.షఫియుల్లా.. గ్రామీణాభివృద్ధి స్పెషల్ కమిషనర్ నుంచి మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా బదిలీ. ఆయన అదనంగా డైరెక్టర్, మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ, టీజీ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ బాధ్యతలు కూడా చూస్తారు.
- అర్బన్ ఫారెస్ట్రీ, హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా వీఎస్ఎన్వీ ప్రసాద్.
- టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తి బదిలీ.
- నిజామాబాద్ కలెక్టర్గాటి.వినయ్ కృష్ణారెడ్డి.
- సిద్దిపేట కలెక్టర్‌గా కె.హైమావతి.
- మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్ నుంచి డైరెక్టర్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
- (ఎస్సీసీఎల్)గా గౌతమ్ పోట్రు బదిలీ.
- మేడ్చల్ మల్కాజ్‌గిరి కలెక్టర్‌గా మిక్కిలినేని మను చౌదరి.
- హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్.
- ఖమ్మం కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి.
- టీఆర్ అండ్ బీ డిపార్ట్‌మెంట్ స్పెషల్ సెక్రటరీ గా ఉన్న దాసరి హరిచందన హైదరాబాద్ కలెక్టర్‌గా బదిలీ.
- పి. ప్రావీణ్య.. హనుమకొండ నుంచి సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ.