పొగ మంచు కారణంగా హైదరాబాద్ లో 37 విమానాలు రద్దు..

పొగ మంచు కారణంగా హైదరాబాద్ లో 37 విమానాలు రద్దు..

 దేశ వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ప్రధాన నగరాల్లో పొగ మంచు కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో పొగ మంచు కారణంగా పలు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు రోజుల్లో 37  విమాన సర్వీసులు రద్దయ్యాయి.  విదేశాలకు వెళ్లే విమానాలు.. ఆదివారం 14 విమానాలు, సోమవారం 15 విమానాలు, మంగళవారం 8 విమాన సర్వీసులు రద్దయ్యాయి. విమాన  సర్వీసులు రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

ఇక దేశ రాజ‌ధాని ఢిల్లీలో పొగ‌మంచు ద‌ట్టంగా క‌మ్ముకుంది. దాదాపు 120 విమానాల రాక‌పోక‌ల‌కు అంతరాయం ఏర్పడింది. 53 విమాన సర్వీసులు రద్దు చేశారు. చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్​కతా నగరాల్లోని ఎయిర్​పోర్టుల్లో ప్రయాణికులకు తలెత్తే ఇబ్బందులను పరిష్కరించేందుకు వార్​రూమ్​లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి ఏయిర్ లైన్స్ కు స్టాండర్డ్ ఆపరేటింటగ్ ప్రొసీజర్స్ ను విడుదల చేశారు.