38 బైకులు, 7 ఆటోలు, కారు సీజ్

38 బైకులు, 7 ఆటోలు, కారు సీజ్

వికారాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్​నేపథ్యంలో వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఇందిరమ్మ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్  నిర్వహించారు. సరైన డాక్యుమెంట్లు లేని 38 బైకులు, 7 ఆటోలు, ఒక కారును సీజ్ చేశారు. ఓనర్లు సరైన డాక్యుమెంట్లు చూపించి  వెహికల్స్​ను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ధారూర్ సీఐ రామకృష్ణ, మోమిన్ పేట సీఐ ఆంజనేయులు, 13 మంది ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

దౌల్తాబాద్​లో రూ.2.86లక్షలు 

కొడంగల్: లోక్​ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ, కర్నాటక బార్డర్​చెక్​పోస్టుల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదివారం దౌల్తాబాద్​ మండలం చంద్రకల్​చెక్​పోస్ట్​వద్ద రెండు కార్లలో రూ. 2.86లక్షలు, 3 తులాల బంగారం, 800 గ్రాముల వెండిని సీజ్ చేసినట్టు సీఐ శ్రీధర్​రెడ్డి తెలిపారు.