భద్రాద్రికొత్తగూడెం పోలీసుల ఎదుట..38 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం పోలీసుల ఎదుట..38 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్‌‌ పార్టీకి చెందిన 38 మంది భద్రాద్రికొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం ఎస్పీ బి.రోహిత్‌‌రాజు వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్ట్‌‌ పార్టీ సౌత్‌‌ బస్తర్‌‌ 9వ ప్లూటన్‌‌కు చెందిన మెంబర్‌‌ సోడి జోగ, పీఎల్‌‌జీఏ ఫస్ట్‌‌ బెటాలియన్‌‌ మెంబర్‌‌ ఎన్. పూజతో పాటు 16 మంది మిలీషియా సభ్యులతో పాటు పలు కమిటీలకు చెందిన వారు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారంతా చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రానికి చెందిన వారేనని చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 265 మంది మావోయిస్ట్‌‌లు లొంగిపోయారని చెప్పారు.