39 దాటినా మేం ఇంకా కుర్రోళ్లమే: రష్యా ఆరోగ్య శాఖ ప్రకటనతో రష్యన్స్ ఫుల్లు హ్యాపీ !

39 దాటినా మేం ఇంకా కుర్రోళ్లమే: రష్యా ఆరోగ్య శాఖ ప్రకటనతో రష్యన్స్ ఫుల్లు హ్యాపీ !

కుర్రాళ్లంటే ఎవరు..? అంటే కుర్రాళ్లంటే మన దేశంలో ఏ ఏజ్ గ్రూప్ అని..? 20 నుంచి 30 ఏళ్ల మధ్య.. 30 ఏళ్లు దాటితే ముసలోళ్లని ఉద్దేశం కాదు. మన దేశంలో 30 దాటితే యంగ్ అనే భావనకు క్రమక్రమంగా దూరమైపోయినట్టే. కానీ.. రష్యాలో మాత్రం అక్కడి ఆరోగ్య శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 39 ఏళ్ల లోపు ఉన్న వాళ్లందరినీ Young అని ప్రకటించేసింది.

అంటే.. రష్యాలో 39 ఏళ్లు వయసొచ్చినా యవ్వనంతో తొణికిసలాడుతున్న కుర్రాడే అనేది అక్కడి ప్రభుత్వ భావన. గత జనరేషన్స్తో పోల్చితే రష్యాలో ఆయుర్దాయం పెరగడం, జీవన ప్రమాణాలు మెరుగవడం.. ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా యాక్టివ్గా ఉండటంతో.. యంగ్ ఏజ్ పరిమితిని 39 ఏళ్లకు పెంచుతూ అక్కడి ఆరోగ్య శాఖ ఈ ప్రకటన చేసింది.

గత తరాలతో పోలిస్తే.. నేటి ప్రజలు చాలా కాలం పాటు చురుకుగా, యవ్వనంగా ఉంటున్నారని రష్యా ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో మనిషి సగటు ఆయుర్దాయం(యావరేజ్​ లైఫ్​ ఎక్స్​పెక్టెన్సీ, జీవితకాలం) కొంత కాలంగా బాగా పెరిగింది. రష్యాలో సగటు మనిషి ఆయుర్దాయం 73.26 సంవత్సరాలు. మహిళలు అయితే పురుషుల కంటే మరో పదేళ్ల వరకూ ఎక్కువగానే జీవిస్తున్నారు. రష్యా మహిళలు సుమారు 79.5 సంవత్సరాలు జీవిస్తుండగా, పురుషులు సగటున 67.9 సంవత్సరాలు జీవిస్తున్నారు .  

►ALSO READ | ఆమెకు భారత్‎పై అవగాహన లేదు: మోడీని ప్రశ్నించిన జర్నలిస్ట్‏కు ఇండియా కౌంటర్..!

1840ల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 40 సంవత్సరాలకు మించేది కాదు. ఆ తరువాత పోషకాహారం అందుతోంది. పరిసరాలు శుభ్రంగా ఉంటున్నాయి. సైన్స్​ డెవలప్​ అయింది. ఈ కారణాల వల్ల సగటు ఆయుర్దాయం వరుసగా పెరుగుతూ వచ్చింది. 1990ల మొదట్లో మనిషి ఆయుర్దాయం సుమారు 64 సంవత్సరాలు ఉండేది. 2021 నాటికి 71 సంవత్సరాలకు పెరిగింది. ఇది ఇంకా ఎక్కువగానే ఉండేది. కానీ.. కరోనా వల్ల పెరుగుదల కాస్త తగ్గింది. కరోనాకు ముందు 2019లో 73 సంవత్సరాలు ఉంది.

ఆయుర్దాయం పెరుగుతుంటే.. జనాభా కూడా పెరిగింది. అయితే.. జనాభా పెరిగిన కొద్దీ పట్టణాలు పెరిగాయి. ఎందుకంటే జనాలు ఎక్కువగా పట్టణాల్లో ఉండడానికే ఇష్టపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి.  2007 నాటికి ప్రపంచ జనాభాలో ఎక్కువ శాతం గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఉన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో 68 శాతం మంది సిటీల్లోనే ఉంటారనేది ఒక అంచనా.