యుద్ధంలో 3 లక్షల మంది ఇజ్రాయిల్ రిజర్వ్​సైనికులు

యుద్ధంలో 3 లక్షల మంది ఇజ్రాయిల్ రిజర్వ్​సైనికులు
  • ఇజ్రాయెల్​చరిత్రలో మొదటిసారి

టెల్​అవీవ్: హమాస్ ​మిలిటెంట్ల దాడిని తీవ్రంగా పరిగణించిన ఇజ్రాయెల్.. వాళ్లను పూర్తి స్థాయిలో మట్టుబెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. గాజా కేంద్రంగా హమాస్​ మిలిటెంట్లు చేస్తున్న దాడులను నిలువరించడంతోపాటు గాజాను స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్​ చేస్తున్నది. ఈ మేరకు అందుకు అవసరమయ్యే సైనిక, ఆయుధ వనరులను సమకూర్చుకుంటున్నది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే ఉన్న ఇజ్రాయెల్​ డిఫెన్స్​ ఫోర్స్(ఐడీఎఫ్)కు మద్దతుగా మరో 3 లక్షల మంది రిజర్వ్​ సైనికులను రంగంలోకి దించాలని నిర్ణయించింది. 

కేవలం రెండు రోజుల్లోనే  రిజర్వ్​ సైనికులందరినీ మొబిలైజ్ ​చేసింది. ఇజ్రాయెల్​లో డిఫెన్స్​ సర్వీస్​ పౌరుల ప్రాథమిక నిర్బంధ సేవ కిందకు వస్తుంది. ప్రతీ పౌరుడు, పౌరురాలు డిఫెన్స్​లో చేయాల్సి ఉంటుంది. డిఫెన్స్ సర్వీస్​లో కనీసం 20 రోజులైనా పనిచేసి, ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్న 40 ఏండ్ల వయసులోపు ఉన్న వారిని రిజర్వ్​ సైనికులుగా పరిగణిస్తారు. 

అధికారి స్థాయి సైనికులకు 45 ఏండ్ల లోపు వరకు కూడా రిజర్వ్​ సైనికులుగా యుద్ధసమయంలో వారి సేవలను వాడుకుంటారు. మరోవైపు ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఇజ్రాయెల్ – -ఫ్రెంచ్ రిజర్విస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇజ్రాయెల్ సైన్యంలో చేరడానికి టెల్ అవీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పయనమయ్యారు. ఈమేరకు ఫ్రాన్స్​రాజధాని ప్యారిస్​లోని చార్లెస్​డి గల్లే ఎయిర్​పోర్టుకు చేరుకుంటున్నట్లు మీడియా ఏజెన్సీలు తెలిపాయి.