4 ఎకరాల్లో హైరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలీషియా ప్రాజెక్ట్

4 ఎకరాల్లో హైరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలీషియా ప్రాజెక్ట్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: నగరానికి చెందిన రియల్టీ డెవెలపర్​ హైరైజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలపర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోకాపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద  4 ఎకరాల్లో  ప్రీమియం 2,3 బీహెచ్​కే గేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలిషియాను లాంచ్​ చేసింది. మొత్తం 371 ప్రీమియం అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను నిర్మిస్తారు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిపి తొమ్మిది అంతస్తులతో మూడు టవర్లు ఉంటాయి. నిర్మాణం పూర్తి కావడానికి రెండేళ్ల వరకు పడుతుంది.

తమ ప్రాజెక్టుకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ, టీఎస్​రెరా పర్మిషన్లు ఉన్నాయని సంస్థ ప్రకటించింది. ఏలీసియా ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1,265 చదరపు అడుగుల నుండి 3,380 చదరపు అడుగుల్లో 2, 3 గదుల అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఉంటాయి.  రెండు క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మూడు స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెండు జిమ్​లు, జాగింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సైక్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్ఫినిటీ స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,   టెన్నిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి వసతులను కల్పిస్తారు.