ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.60కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్

ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.60కోట్ల భూమి అక్రమ రిజిస్ట్రేషన్

శంకర్ పల్లి, వెలుగు: ఫేక్ ​డాక్యుమెంట్లతో రూ.60 కోట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ ​చేయించుకున్న నలుగురిని శంకరపల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్​తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కాకినాడకు చెందిన ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణరావు 2003లో తన స్నేహితులతో కలిసి శంకర్​పల్లిలోని సర్వే నం.334, 335లో 5 ఎకరాల 12గుంటల కొన్నారు. ఆ భూమిని ప్రోగ్రెసివ్ ఆగ్రో సర్వీసెస్​పేరు మీద రిజిస్ట్రేషన్​ చేయించారు. తర్వాత అలాగే వదిలేశారు.

 విషయం తెలుసుకున్న మచిలీపట్నం, కాకినాడకు చెందిన దేవాగుల రామవీర వెంకట వరప్రసాద్​, పరశరాం పార్థసారథి, త్రినాథ్, పరశరాం విజయభగవాన్​ఎలాగైనా భూమిని కాజేయాలని కుట్రపన్నారు. 2014లో ముళ్లపూడి వీర వెంకట సత్యనారాయణరావు చనిపోయాడని, అతని వారసుడు దేవాగుల వరప్రసాద్​అని ఫేక్​ఆధార్​కార్డులు సృష్టించారు. అధికారుల సాయంతో 2024 జనవరిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం తెలుసుకున్న బాధితుడు శంకర్​పల్లి పీఎస్​లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితులు నలుగురిని అదుపులోకి  తీసుకున్నారు.