ESI కుంభ‌కోణం కేసు.. 4 కోట్ల ఆస్తులు స్వాధీనం

ESI కుంభ‌కోణం కేసు.. 4 కోట్ల ఆస్తులు స్వాధీనం

హైదరాబాద్ : ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ స్పీడ్ పెంచింది. కేసులో నిందితులుగా ఉన్న మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మికి చెందిన నాలుగు కోట్ల రూపాయల నగదును మంగళవారం సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో దేవికారాణి, నాగలక్ష్మిలను అరెస్ట్ చేసే కంటే ముందే.. ఈ డబ్బును ఓ బిల్డర్ కు ఇచ్చినట్టు గుర్తించింది ఏసీబీ. అవినీతి సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో 4 కోట్ల 47 లక్షలు సైబరాబాద్ కు చెందిన ఓ ప్రైవేటు డెవలపర్ కు ఇచ్చారు. దీనికి సంబంధించి గతంలోనే బిల్డర్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో రియల్టర్ ఆ డబ్బును ఏసీబీకి ఇచ్చేశారు.