భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కేసులు ఎక్కువ వ్యాక్సినేషన్ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. అయితే కరోనా భారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువ కావడంతో వారికి బెడ్ల సరిపోకపోవడంతో పాటు...ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొతర ఏర్పడంతో.. అందుబాటులోని అన్ని ఆక్సిజన్ వనరులను ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్ కు సింగపూర్ ప్రభుత్వం బాసటగా నిలిచింది. కరోనాపై పోరాటంలో భారత్ కు తాము అండగా ఉంటామని సింగపూర్ ప్రకటించింది. అంతేకాదు.. 4 క్రయోజనిక్ ట్యాంకర్ల నిండా ఆక్సిజన్ ను భారత్ కు పంపింది. ఈ క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లతో భారత వాయుసేన కార్గో విమానం సింగపూర్ లోని చాంగీ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరింది.
