హైదరాబాద్ లో ఘోర ప్రమాదం... కేబుల్ బ్రిడ్జిపై డివైడర్ ను ఢీకొన్న కారు... నలుగురికి తీవ్ర గాయాలు...

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం... కేబుల్ బ్రిడ్జిపై డివైడర్ ను ఢీకొన్న కారు... నలుగురికి తీవ్ర గాయాలు...

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై కారు డివైడర్ ను ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( మే 17 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కేబుల్ బ్రిడ్జిపై కారు అతివేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొనడంతో ముందు భాగం నుజ్జు నుజ్జయ్యింది. అయితే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ ఢీ కొన్న సమయంలో 100కిలో మీటర్ల వేగంతో డివైడర్ కు తాకినట్లు తెలుస్తోంది. 

ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో బ్రిడ్జిపై వాహనాలేమీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ మధ్య కేబుల్ బ్రిడ్జిపై వరుస ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు.