- ఇప్పటికే తొలగించిన ఓట్లు 25,048
- దేవరకొండ, నకిరేకల్‌లో పెరిగిన ఓటర్లు
యాదాద్రి, వెలుగు : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)లో ఉమ్మడి నల్గొండ జిల్లా ఓటర్లు పెద్ద సంఖ్యలో మ్యాపింగ్ కాలేదు. వీరందరూ ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డులను ఆధారంగా చూయించాల్సి ఉంటుంది. లేకపోతే ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2002లో జరిగింది. అప్పటి లిస్ట్ ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 24,30,469 మంది ఓటర్లు ఉన్నారు. 2025లోప్రచురించిన లిస్ట్ ప్రకారం ఓటర్ల సంఖ్య 30,09,496కుచేరింది.
4,47,921 ఓటర్లు మ్యాపింగ్ కాలే..
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్ నిర్వహణలో భాగంగా 2002, 2025 ఓటరు లిస్ట్‌ను ఆఫీసర్లు మ్యాపింగ్ చేశారు. ఈ ప్రకియలో 2002 లిస్ట్‌లోని ఓటర్ల పేర్లు, ఓటర్ ఐడీ నెంబర్ ఉంటే దాని ప్రకారం, పోలింగ్ స్టేషన్ నెంబర్ ప్రకారం పోల్చి చూశారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 30,09,496 ఓటర్లు ఉండగా చనిపోయిన 25,048 ఓటర్లను లిస్ట్ నుంచి తొలగించారు.
నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల్లో తొలగించిన వారు పోనూ కొత్తగా 791 మంది చేరారు. దీంతో ఓటర్ల సంఖ్య 29,84,448 చేరింది. వీరిలో 4,47,921 ఓటర్లు మ్యాపింగ్ కాలేదు. లిస్ట్‌లో పేర్లు, అడ్రస్ స్పెల్లింగ్ మిస్టేక్ ఓటర్లు 7,47,354 ఉన్నారు.
ఏదైనా ప్రూఫ్ చూపించాల్సిందే..
ఓటర్లు అందరికీ ఎన్యూమరేషన్ ఫారాలను అందించడానికి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ఓటర్లు సరిదిద్దుకునే అవకాశం ఉంది. మ్యాపింగ్ కానీ ఓటర్లు మాత్రం ఎన్నికల కమిషన్ సూచించిన 12 గుర్తింపు(ఆధార్ మినహా) కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులకు సంబంధించిన ఆధారాలను సైతం చూపించాల్సి ఉంటుంది. లేకపోతే ఓటరు లిస్ట్ నుంచి పేరు తొలగిస్తారు.
