బంకులో స్వైపింగ్ మెషన్ మోసం: 4లీటర్ల పెట్రోల్కు రూ.16వేలు..

బంకులో  స్వైపింగ్ మెషన్ మోసం: 4లీటర్ల పెట్రోల్కు రూ.16వేలు..

గుజరాత్కు చెందిన ఓ రైతు బైక్లో పెట్రోల్ పోయించుకొని డబ్బులు చెల్లించేందుకు స్వైప్ మిషన్ లో డెబిట్ కార్డును స్వైప్ చేయగా..ఏకంగా ఖాతానుంచి 16వేల రూపాయలు మాయమయ్యాయి. 4 లీటర్ల పెట్రోల్ పోయించుకున్న ఆ రైతు.. రూ. 400 చెల్లించేందుకు బంక్ సిబ్బంది పాయింట్ ఆఫ్ సేల్( POS) మెషీన్ ద్వారా చెల్లింపులు చేసుకున్నారు. రైతు ఇంటికి వెళ్లి తన ఖాతాలో అమౌంట్ ను చెక్ చేసుకోగా.. ఖాతా నుంచి రూ. 16వేలు బదిలీఅయినట్లు గుర్తించాడు. లబోదిబో మన్న రైతు పోలీసులు ఫిర్యాదు చేశారు. రైతు ఖాతానుంచి డబ్బు ఎలా మాయమైందో తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. 

గుజరాత్ కు చెందిన విశాల్ హిర్పారా అనే రైతు  స్థానికంగా ఉంటే ఓ పెట్రోల్ బంక్ లో నాలుగు లీటర్లపెట్రోల్ పోయించుకొని రూ. 400 పే చేశాడు. అయితే తర్వాత అతను తన ఖాతాను రూ. 16 వేలు కోల్పోయినట్లు గుర్తించాడు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

విశాల్ హిర్పారా బ్యాంకు ఖాతానుంచి రూ. 16వేలు ఎలా మాయమయ్యాయో పోలీసులు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. విశాల్ తన బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలను ఎవరితోనైనా పంచుకోలేదని తెలిపారు..అయితే విశాల్ ఖాతానుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయి. పోలీసులు మరింతలోతుగా విచారణ చేపట్టారు. 

మహారాష్ట్రలోని సైబర్ క్రైం పోలీసులకు ఎదురైన ఓ ఘటన ఆధారంగా పోలీసులు..మాగ్నెటిక్ స్ట్రిప్  ద్వారా కార్డు  నంబర్లను , పిన్ నంబర్ ను , సీవీవీ డేటాను క్లోన్ చేయడానికి POS పరికరాలు, ఏటీఎంలకు జోడించే స్కిమ్మర్లను పెట్రోల్ బంక్ లో POSవద్ద ఉపయోగించి ఉండొచ్చని  అనుమానిస్తున్నారు. 

స్కామర్లు విశాల్ హిర్పారా ఫోన్ ను హ్యాక్ చేసి డార్క్ వెబ్ ద్వారా లావాదేవీలు జరిపారు. విశాల్ ఖాతానుంచి గిఫ్ట్ ఆర్టికల్స్ కొనుగోలు చేసేందుకు డబ్బును వినియోగించారని పోలీసులు తెలిపారు. హిర్పారా తన కార్డు వివరాలను డార్క్ వెబ్ లేదా  టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఇంతకుముందు విక్రయించారని.. పెట్రోల్ బంక్ లో స్వైప్ చేసిన తర్వాత డబ్బును పోగొట్టుకోవడం  కేవలం యాదృచ్ఛికమే అయి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఏదైతేనా డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించే ముందుకు జాగ్రత్తగా ఉండాలని.. కార్డు ఉపయోగించే ముందు సేఫ్ గురించి ఆలోచించాలని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.