
భోపాల్: ఇల్లు కూలి ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు చనిపోయిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. రేవా జిల్లా, చుచియారీ బెహెరా గ్రామంలో ఈ ప్రమాదం జరుగగా.. మృతుల్లో ఓ 35 ఏండ్ల వ్యక్తి, అతని 60 ఏండ్ల తల్లి, 7, 8 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో బాలిక తీవ్రంగా గాయపడింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఆస్పత్రికి చేరుకున్న అధికారులు, పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన బాలికను వెలికితీసి చికత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టానికి పంపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి చుట్టూ నీరు నిలిచి బురద పేరుకుపోయిందని, దీంతో గోడలు నానిపోయి ఇల్లు కూలిందని అధికారులు అంచనా వేశారు. భారీ వరదల కారణంగా పలుచోట్ల రోడ్లు తెగిపోవడంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి ఘటనా ప్రాంతానికి చేరుకోవడం ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.