ఫ్లైట్‌లో కొట్టుకున్న మహిళా ప్యాసింజర్‌లు.. క్వీన్​ల్యాండ్స్​ లో ఎమర్జన్సీ ల్యాండింగ్​

ఫ్లైట్‌లో కొట్టుకున్న మహిళా ప్యాసింజర్‌లు.. క్వీన్​ల్యాండ్స్​ లో ఎమర్జన్సీ ల్యాండింగ్​

బస్సులో, రైళ్లలో సీట్ల కోసం తిట్టుకోవడం, కొట్టుకోవడం మామూలే. ఇప్పుడు వెరైటీగా విమానాల్లోనూ ఇలాంటి సీన్లు కనిపిస్తున్నాయి. చివరికి బస్సుల్లో, రైళ్లలో కూడా జరగని విధంగా వెర్రెత్తి తోటి ప్రయాణికులపై మూత్రం కూడా పోసేస్తూ అనాగరికతను చక్కగా ప్రదర్శించుకుంటున్నారు. మనషులు అన్న తర్వాత భావోద్వేగాలు సహజం కదా మరి. ఓ విమానంలో అలాంటిదే జరిగింది. కొందరు ప్రయాణికులు నింగిమధ్యలో వెళ్తున్న విమానంలో పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. ఏప్రిల్​ 20న ఆస్ట్రేలియా విమానంలో ఈ దారుణం జరిగింది.

ఎమర్జన్సీ ల్యాండింగ్​..నలుగురు అరెస్ట్​ 


కెయిర్న్​  నుంచి నార్తర్న్‌ టెరిటరీ ఆఫ్‌ ఆస్ట్రేలియాకు వెళ్తున్న విమానంలో నలుగురి మధ్య ఏదో గొడవైంది. ఎక్కడున్నామో చూసుకోకుండా చడామడా తిట్టుకుంటూ చావగొట్టుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. ఒకడు సీసాతో మరొకడి నెత్తి పగలగొట్టాడు. ఆ కొట్లాటతో ఫర్నీచర్ కూడా దెబ్బతినింది. విమాన సిబ్బందికి వారిని కట్టడం చేయడం సాధ్యం కాలేదు. దీంతో పైలెట్ బస్సును ఆపినట్టు, విమానాన్ని క్వీన్‌ల్యాండ్స్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించాడు. విమానం దిగుతున్నప్పుడు కూడా ముఠా కొట్టుకోవడం ఆపలేదు .క్యాబిన్ క్రూ మాట వినకుండా ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించిన ఆ మహిళపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. గొడవపడొద్దని హెచ్చరించారు. ఆ తరువాత టేకాఫ్‌ అయిన కాసేపటికీ మళ్లీ వాళ్లు గొడవ పడ్డారు. ఈ కారణంగా ఓ విండో డ్యామేజ్ అయింది. ఇలా గొడవ పడుతూ మిగతా ప్రయాణికులను ప్రమాదంలో పడేసిన కారణంగా ఆమెపై పోలీసులు FIR నమోదు చేశారు.విమానం ల్యాండ్ కాగానే   ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు.   నిందితులను కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు అసలేం జరిగిందో తీరిగ్గా విచారణ జరుపుతున్నారు.

ఎయిర్ ఇండియాలోనూ..

ఇంటర్నేషనల్‌ ఫ్లైట్‌లలో రోజుకోగొడవ జరుగుతోంది. ప్రయాణికులు గొడవ పడడమో, ఫుల్‌గా తాగేసి రచ్చ చేయడం లాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడలాంటి ఘటనే మరోటి జరిగింది. ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్తున్న ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ విమాన సిబ్బందితో గొడవకు దిగాడు. టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ గొడవ మొదలైంది. చేసేదేమీ లేక వెంటనే మళ్లీ ఢిల్లీలో ల్యాండ్ చేశారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు Air India యాజమాన్యం ఆ ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసింది. ఏప్రిల్ 10న ఉదయం  6.35 నిముషాలకు ఢిల్లీ నుంచి విమానం బయల్దేరింది. కాసేపటికే ప్యాసింజర్‌కి, సిబ్బంది మధ్య గొడవైంది. వెంటనే ఢిల్లీకి తిరుగు పయనమైంది ఫ్లైట్ సిబ్బంది ఆ ప్యాసింజర్‌ను పోలీసులకు అప్పగించి మళ్లీ లండన్‌కు బయల్దేరారు.