న్యూఢిల్లీ: అయోధ్య రామ జన్మభూమి వివాదం కేసు సుప్రీంకోర్టు చరిత్రలోనే సెకండ్ లాంగెస్ట్ కేస్ గా నిలిచింది. ఈ కేసులో విచారణ ఆగస్ట్ 6న ప్రారంభం కాగా, అక్టోబర్16న వాదనలు ముగిశాయి. మొత్తంగా 40 రోజుల పాటు ‘మారథాన్ హియరింగ్’ జరిగింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ నెల17న రిటైర్ కానున్నారు. అందువల్ల అయోధ్య కేసులో విచారణను బెంచ్ వేగవంతం చేసింది. మొదట అక్టోబర్18లోపు ఈ కేసు విచారణ ముగించాలని కోర్టు భావించింది. ఆ తర్వాత గడువును ఒక రోజు ముందుకు జరిపింది. విచారణ సందర్భంగా అనేక సార్లు హిందూ, ముస్లిం పిటిషనర్ల తరఫున లాయర్ల మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. చివరిరోజైన అక్టోబర్16న ముస్లిం పిటిషనర్ల లాయర్ రాజీవ్ ధావన్ హిందూ మహాసభ సమర్పించిన మ్యాపును కోర్టులోనే చించివేయడంతో దుమారం రేగింది. దీంతో బెంచ్ సీరియస్ అయింది. వాదనలు ‘‘ఇక చాలంటే చాలు” అంటూ విచారణను ముగించింది. దశాబ్దాల తరబడి కొనసాగిన ఈ వివాదానికి శనివారం తుది తీర్పుతో ముగింపు పలికింది. ఇక రాజ్యాంగపరమైన వివాదానికి సంబంధించిన1973 నాటి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్కేరళ కేసులో 68 రోజుల పాటు విచారణ జరిగింది.1950లో సుప్రీంకోర్టు ఏర్పడినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఎక్కువ రోజులు విచారణ జరిగిన కేసుగా ఇది నిలిచింది. ఆధార్స్కీం కేసు మూడో లాంగెస్ట్ కేస్ గా నిలిచింది. ఆ కేసులో 38 రోజుల పాటు విచారణ జరిగింది.
