అమెరికాలో కరోనాకు ఒక్కరోజే 4 వేల మంది బలి

అమెరికాలో కరోనాకు ఒక్కరోజే 4 వేల మంది బలి
కొత్తగా 2.34 లక్షల కేసులు కేసులు, మరణాలు ఇంకా పెరుగుతాయంటున్న నిపుణులు వాషింగ్టన్: కరోనా ధాటికి అమెరికా ఇంకా విలవిల్లాడుతోంది. దేశంలో రోజూ లక్ష, రెండు లక్షల దాకా కొత్త కేసులు వస్తున్నాయి. మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 3,927 మంది కరోనాకు బలైపోయారు. కొత్తగా2 లక్షల 34 వేల 550 మందికి వైరస్ సోకింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 2 లక్షల 16 వేల 991కి చేరింది. మృతుల సంఖ్య 3 లక్షల 50 వేల 778కి పెరిగింది. అయితే బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త స్ట్రెయిన్ కరోనా ఇప్పటికే అమెరికాకూ పాకింది. కాలిఫోర్నియా, కొలరాడోలో పలువురికి బ్రిటన్ కరోనా వైరస్ సోకినట్లు కన్ఫామ్ కాగా, మరిన్ని రాష్ట్రాలకూ వైరస్ వ్యాపించి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్ లు అందుబాటులోకి వచ్చినా.. అమెరికాలో ఇంకా వైరస్ ముప్పు తొలగిపోలేదని, మున్ముందు కేసులు, మరణాలు మరింత భారీగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు బుధవారం నాటికి 8. 32 కోట్లు దాటాయి. మరణాలు18 లక్షల15 వేలు దాటాయి. For More News.. అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం.. సపోర్ట్‌ చేసిన బీజేపీ ఎమ్మెల్యే రేపు అన్ని సిటీల్లో వ్యాక్సిన్ డ్రై రన్‌ న్యూ ఇయర్‌కు వ్యాక్సిన్‌తో వెల్‌కమ్‌! ఓటుకు నోటు కేసులో చంద్రబాబే డీల్ చేసిండు