13న ముంబైలో డబ్ల్యూపీఎల్ ప్లేయర్ల ఆక్షన్

13న ముంబైలో డబ్ల్యూపీఎల్  ప్లేయర్ల ఆక్షన్

ముంబై: విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌) తొలి సీజన్‌‌‌‌ ప్లేయర్ల వేలంలో 409 మంది బరిలో నిలిచారు. ఈ నెల 13న ముంబైలో జరిగే వేలం కోసం 1525 మంది రిజిస్టర్‌‌‌‌ చేసుకున్నారు. ఫ్రాంచైజీల ఇంట్రస్ట్‌‌‌‌ మేరకు ఇందులో 409 మందిని మాత్రమే ఫైనల్‌‌‌‌ లిస్ట్‌‌‌‌లో చేర్చినట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇందులో 264 మంది ఇండియన్స్‌‌‌‌ ఉండగా, 163 మంది ఫారిన్‌‌‌‌ ప్లేయర్లు ఉన్నారు. అసోసియేట్‌‌‌‌ దేశాల నుంచి 8 మందికి చోటు దక్కింది.  ఐదు ఫ్రాంచైజీల్లో కలిపి 90 మందికి అవకాశం ఉంది. రూ. 50 లక్షల కేటగిరీలో  ఇండియా కెప్టెన్​ హర్మన్​​, మంధాన, షెఫాలీ సహా24 మంది ఉన్నారు.  మరో 30 మంది రూ. 40 లక్షల బేస్​ప్రైజ్​ కేటగిరీలో ఉన్నారు. అండర్​–19 వరల్డ్​ కప్​ విన్నింగ్​ టీమ్​లో ఆడిన  గొంగడి త్రిష, యశశ్రీతో పాటు హైదరాబాద్​ నుంచి మదివాడ మమత, ప్రణవి, ఇషిత  రూ. 10 లక్షల  బేస్​ప్రైజ్​లో నిలిచారు.