
బషీర్ బాగ్, వెలుగు: పోలింగ్తేదీ సమీపిస్తుండా హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుబడుతుంది. ఆదివారం అర్ధరాత్రి ఖైరతాబాద్ సెగ్మెంట్పరిధి హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్.13లో ఓ వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయాడు. బంజారాహిల్స్ కు చెందిన సునీల్ యాదవ్ ఓటర్లను ప్రలోభపెడుతున్నాడని నారాయణగూడ పోలీసులకు కాంగ్రెస్, బీజేపీ నేతలు సమాచారం ఇచ్చారు.
పోలీసులు వెళ్లి అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రూ.4.13 లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే గోషామహల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ నేత ఆదేశాల మేరకే డబ్బులు పంచుతున్నట్లు సునీల్ పోలీసుల దర్యాప్తులో ఒప్పుకున్నట్లు నారాయణగూడ పోలీసులు తెలిపారు.