రాజకీయ కుట్రలో భాగంగానే దాడి: సీఈసీ జ్ఞానేష్కు మద్ధతుగా 42 మంది మాజీ జడ్జీల లేఖ

రాజకీయ కుట్రలో భాగంగానే దాడి: సీఈసీ జ్ఞానేష్కు మద్ధతుగా 42 మంది మాజీ జడ్జీల లేఖ

సర్ ప్రక్రియలో అవకతవకలు, అక్రమ ఓట్ల తొలగింపు మొదలైన అంశాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు మద్ధతుగా మాజీ జడ్జీలు ముందుకు వచ్చారు. రాజకీయ కుట్రలో భాగంగానే సీఈసీపై దాడి జరుగుతోందని 2026 అక్టోబర్ 8న 42 మంది మాజీ జడ్జీలు లేఖ విడుదల చేశారు.

ఎన్నికల సంఘం పైన, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలపై పద్ధతి ప్రకారం దాడి జరుగుతోందని అన్నారు. ప్రస్తుత పరిణామాలపై ఓపెన్ లెటర్ విడుదల చేశారు. తమకు రాజకీయ ఉద్దేశాలు లేవని.. మౌనంగా ఉండటం తటస్థంగా ఉన్నట్లు అనిపించుకోదని చెప్పారు.

రాజకీయ కారణాలతో రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నట్లు ఆరోపించారు. దీని పర్యావసానం ప్రజల విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందన్నారు. రాజ్యాంగ సంస్థలను విమర్శించడం రాజ్యాంగ హక్కు.. కానీ ఆ సంస్థలను కించపర్చడం తగదన్నారు. 

ఎలాంటి సరైన ఆధారాలు లేకుండా ఓట్ల దొంగతనం వంటి ఆరోపణలు చేయడం తగదని సూచించారు. అదే సమయంలో అధికారులను దొంగలు, కీలుబొమ్మలు అంటూ విమర్శించడం సరికాదని అన్నారు. 

ఖచ్చితమైన ఓటర్ల జాబితాలను నిర్వహించడం ఎన్నికల సంఘం రాజ్యాంగ విధిలో భాగమని పేర్కొన్నారు. సర్ ప్రక్రియకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు.