గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డారు. ఇందులో 300 మంది బైకర్లు, 18 మంది ఆటో డ్రైవర్లు, 99 మంది కారు డ్రైవర్లు, 7 మంది భారీ వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వీరందరిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
గత వారం నమోదైన 358 డ్రంకెన్ డ్రైవ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. ఇందులో 304 మంది మందుబాబులకు జరిమానా, 22 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్, 32 మందికి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు.
