హైదరాబాద్, వెలుగు: కస్తూర్బాగాంధీ బాలిక ల విద్యాలయాలు(కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల(యూఆర్ఎస్)ల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొత్తం 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, ఎస్ఓ పోస్టులకు 43,056 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఒక్కోపోస్టుకు 34 మంది పోటీపడుతున్నారు. అయితే తాజాగా అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. ఈ నెల15 వరకు పోస్ట్ అప్లైయిడ్ జిల్లా వివరాలను నమోదు చేసుకోవడానికి కొత్త ఫీల్డ్ వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. కేజీబీవీ, యూఆర్ఎస్ పోస్టులకు అప్లై చేసిన అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 24 ,25, 26 తేదీల్లో ఆన్లైన్లో పోస్టుల వారీగా పరీక్షలుంటాయని తెలిపారు. ఏమైనా సమస్యలుంటే 73866 60584 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
