బంగాళాఖాతంలో భూకంపం ..సునామి వస్తదా.. వాతావరణ శాఖ ఏమంది ?

బంగాళాఖాతంలో భూకంపం ..సునామి వస్తదా.. వాతావరణ శాఖ ఏమంది ?

బంగాళాఖాతంలో భూ ప్రకంపనలు అలజడిని సృష్టించాయి.  2023 ఆగస్టు 05  మధ్యాహ్నం 02 గంటల 39 నిమిషాలకు భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌ఎస్‌సి) తెలిపింది.  స‌ముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది.  రిక్టర్ స్కేల్ పై  భూకంప తీవ్రత 4.4 మ్యాగ్నిట్యూడ్ గా నమోదైంది. అయితే  ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.  బంగాళాఖాతంలో భూకంపం రావడంతో ఎలాంటి సునామి హెచ్చరికలు లేవని  వాతావరణ శాఖ  స్పష్టం చేసింది.  

అంతకుముందు జమ్మూ కశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్‌మార్గ్‌ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.2గా నమోదైనట్లు పేర్కొంది. గుల్‌మార్గ్‌కు 184 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలం నుంచి 129 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది.