హైదరాబాద్‌సిటీ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా 25 నుంచి 28వ తేదీ వరకూ ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు స్పెషల్బస్సులు నడపనున్నట్టు గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. కీసరగుట్టకు సికింద్రాబాద్‌నుంచి 90 ,ఈసీఐఎల్క్రాస్రోడ్స్నుంచి 100, అమ్ముగూడ నుంచి 70, ఉప్పల్క్రాస్రోడ్స్నుంచి 25 బస్సులు కలిపి మొత్తం 285 బస్సులు, ఏడుపాయలకు సీబీఎస్నుంచి 125 బస్సులను నడపనున్నట్టు వెల్లడించారు. బీరంగూడ జాతరకు పటాన్చెరు నుంచి 30 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు చెప్పారు. వివరాలకు కోఠి బస్‌స్టేషన్ 99592 26160, రేతిఫైల్ బస్‌స్టేషన్9959226154 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
