- వరంగల్ జిల్లాలో ఘనంగా ముగిసిన 44వ రాష్ట్రస్థాయి పోటీలు
పర్వతగిరి, వెలుగు: వరంగల్జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్స్కూల్లో మూడు రోజుల పాటు జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడోత్సవాలు గురువారం ముగిశాయి. ఈ పోటీల్లో1200 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చూపారు. మహిళల విభాగంలో నల్గొండ జట్టు(ఫస్ట్ ), మహబూబాబాద్ (సెకండ్), నారాయణపేట (థర్డ్) స్థానాల్లో నిలిచాయి.
పురుషుల విభాగంలో యాదాద్రి భువనగిరి జట్టు (ఫస్ట్ ), సంగారెడ్డి (సెకండ్), హైదరాబాద్ (థర్డ్ ), విజయం సాధించాయి. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారు లు మహారాష్ట్రలో జరగబోయే జాతీయస్థాయి షూటింగ్బాల్క్రీడల్లో పాల్గొంటార ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 100 మంది టెక్నికల్ సహాయకులు సేవలందించినట్లు చెప్పారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్ధన్నపేట -ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరై మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయన్నారు. గ్రామీణ క్రీడలకు రాష్ట్రస్థాయి గుర్తింపు రావడం గర్వకారణమని, ఇలాంటి పోటీలు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొస్తాయని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా ఎదగాలని సూచించారు.
అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందించారు. షూటింగ్ బాల్ అసోసియేషన్ ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో -మాజీ ఎమ్మెల్యే రమేశ్, స్కూల్ చైర్మన్ రాచకొండ అశోకాచారి, హెచ్ వోడీ జయంత్, కరస్పాండెంట్ మహేందర్, రమేశ్, ఏవో అశోక్, రాజు, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్ రావు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
