రెండు స్కూళ్లలో ఫుడ్​ పాయిజనింగ్

రెండు స్కూళ్లలో ఫుడ్​ పాయిజనింగ్
  • 45 మంది స్టూడెంట్లకు అస్వస్థత

బాన్సువాడ/వర్ని, వెలుగు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని రెండు స్కూళ్లలో గురువారం ఫుడ్​పాయిజనింగ్​తో 45 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట ప్రైమరీ స్కూల్​లో గురువారం మధ్యాహ్న భోజనం వికటించి 10 మంది స్టూడెంట్లు అనారోగ్యం పాలయ్యారు. కాలం చెల్లిన కారం, నూనె తదితర వంట వస్తువులు వాడటం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం వరకు తమకు విషయం చెప్పలేదని స్టూడెంట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు స్కూల్​వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామపెద్దలు తల్లిదండ్రులకు సర్దిచెప్పారు. నిజామాబాద్‌‌‌‌ జిల్లా రుద్రూర్‌‌ ‌‌మండలం రాయకూర్‌‌ అప్పర్​ప్రైమరీ స్కూల్‌‌‌‌లో  మధ్యాహ్న భోజనం తిన్న 35 మంది స్టూడెంట్స్‌‌ వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని హాస్పిటల్‌‌కు తరలించారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్స్‌‌ తల్లిదండ్రులు స్కూల్‌‌కు వచ్చి టీచర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.