న్యూఢిల్లీ : 2020–21 లో వచ్చిన రెవెన్యూ నెంబర్లను తిరిగి అడ్జెస్ట్ చేయడంతో ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌ను నడుపుతున్న థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో భారీ నష్టం వచ్చింది. గతంలో రెవెన్యూని రూ. 4,400 కోట్లుగా ప్రకటించిన కంపెనీ తాజాగా ఈ నెంబర్ రూ. 2,280 కోట్లని పేర్కొంది. దీంతో కంపెనీ నష్టాలు 2019–20 లో వచ్చిన రూ. 262 కోట్లతో పోలిస్తే 2020–21 లో రూ. 4,588 కోట్లకు పెరగడం గమనించాలి. ఆడిట్ రిపోర్ట్‌లో వచ్చినట్టు ఎటువంటి రెవెన్యూ లాస్ జరగలేదని బైజూస్ ఫౌండర్ బైజూ రవింద్రన్ అన్నారు. 2020–21 లో బిజినెస్ బాగా వృద్ధి చెందిందని, కొత్త బిజినెస్ మోడల్ రెవెన్యూని గుర్తించడం ఇదే మొదటి ఏడాది కాబట్టి దీంతో 40 % రెవెన్యూ తర్వాతి సంవత్సరాల లెక్కల్లోకి వచ్చాయని వివరించారు.
నిఫ్టీ బ్యాంక్ దూకుడు..
కీలక లెవెల్ అయిన 40 వేలకు దిగువన స్తబ్దుగా కదిలిన నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్, బుధవారం సెషన్‌లో ఈ లెవెల్‌ను దాటి 1.3 శాతం లాభపడింది. కిందటి సెషన్ లో 40,873 దగ్గర క్లోజయిన ఈ ఇండెక్స్, బుధవారం సెషన్‌లో ఇంట్రాడే కనిష్టమైన 40,289 నుంచి షార్ప్‌గా కోలుకొంది. బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో 41 వేల మార్క్‌ను క్రాస్ చేసి 41,405 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 41,627 వరకు ఈ ఇండెక్స్ వెళ్లింది. ఈ ఇండెక్స్‌లోని ఇండస్‌ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, పీఎన్‌బీ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. మరోవైపు పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ బుధవారం సెషన్‌లో 1.7 శాతం పెరగగా, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 1.5 శాతం లాభపడింది.
