ఒకే ఓవర్లో 46 పరుగులు..సునామీ ఇన్నింగ్స్

 ఒకే ఓవర్లో 46 పరుగులు..సునామీ ఇన్నింగ్స్

సాధారణంగా క్రికెట్లో 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టగలరు. దీని ప్రకారం 36 పరుగులు వస్తాయి. ఇందులో వైడ్ లేదా...ఓ నోబ్ వస్తే..మరో రెండో మూడో పరుగులు యాడ్ అవుతాయి. ఈ తరహ ఘటనలు జరగడం అరుదు. కానీ ఒకే ఓవర్ లో 46 పరుగులు కొట్టడం మీరెప్పుడైనా చూశారా...కనీసం విన్నారా...ఏంటి ఒకే ఓవర్ లో 46 పరుగులా అని ఆశ్చర్య పోతున్నారా..నిజం..

ఎడా పెడా కొట్టాడు..

6  బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి.. 36 పరుగులు సాధించడమే గొప్ప అనుకుంటే.. తాజాగా ఓ బ్యాట్స్ మన్ ఒకే ఓవర్ లో ఏకంగా 46 పరుగులు పిండుకున్నాడు.  ఒకే ఓవర్‌లో 6 సిక్సులు బాదాడు. వీటితో పాటు..మరో ఫోర్లు సాధించాడు. అయితే  ఈ ఓవర్‌లో బౌలర్ రెండు నోబాల్స్ వేయడంతో ఆ బ్యాట్స్మన్  ఈ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

ఎలా కొట్టాడంటే..

కువైట్‌లో  జరుగుతున్న KCC  ఫ్రెండీ ఛాంపియన్స్ ట్రోఫీ-2023లో భాగంగా NCM  ఇన్వెస్ట్‌మెంట్-సీసీ ట్యాలీ జట్ల మధ్య జరిగిన టీ20లో  ఈ సునామీ ఇన్నింగ్స్ నమోదైంది. సీసీ ట్యాలీ బౌలర్ హర్మన్ సింగ్ వేసిన 15వ ఓవర్‌లో NCM ఇన్వెస్టిమెంట్ బ్యాట్స్మన్  వాసుదేవ్ 46 రన్స్ పిండుకున్నాడు. ఫస్ట్ బాల్ను సిక్స్ కొట్టాడు. అది నోబాల్, ఆ తర్వాత బంతి ఫోర్..అదీ నోబాలే. తర్వాత బంతిని సిక్స్ గా మలిచాడు. ఆ తర్వాత బంతి కూడా సిక్స్ వెళ్లింది. అయితే ఇదీ నోబాల్. మిగతా నాలుగు బంతుల్లో మూడు సిక్సులు, ఓ ఫోర్ కొట్టడంతో మొత్తం 46 పరుగులొచ్చాయి.