V6 News

తెలంగాణలో 46,480 వక్ఫ్ ఆస్తులు : కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో  46,480 వక్ఫ్ ఆస్తులు : కేంద్ర ప్రభుత్వం
  •   కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో 46,480 వక్ఫ్ ఆస్తులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల పత్రాలను డిజిటలైజ్ చేయడానికి తెచ్చిన ‘ఉమీద్’ పోర్టల్‌‌లో చివరి 150 గంటల్లో 2.5 లక్షలకుపైగా ఆస్తులు నమోదైనట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు.2025 జూన్ 6న ‘ఉమీద్’ పోర్టల్‌‌ను ప్రారంభించిన కేంద్రం.. వక్ఫ్ ఆస్తుల నమోదుకు 6 నెలల గడువు విధించింది. 

ఇది డిసెంబర్ 6న ముగిసినప్పటికీ, చివరి 150 గంటల్లో 2,50,000కు పైగా ఆస్తులు నమోదైనట్లు మంత్రి చెప్పారు. మొత్తం 6 నెలల్లో 5,17,082 వక్ఫ్ ఆస్తులు నమోదయ్యాయన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌‌లో 92,830, మహారాష్ట్ర లో 62,939, కర్నాటకలో 58,328, గుజరాత్‌‌ లో 27,458, బీహార్‌‌ లో15,204, పంజాబ్‌‌25,910, హర్యానాలో13,445 వక్ఫ్‌‌ ఆస్తులున్నాయి.