
ఆమనగల్లు, వెలుగు: కుక్కల దాడిలో 48 గొర్రెలు మృతి చెందాయి. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా అమనగల్లు మండలం మేడిగడ్డ తండాకు చెందిన ఎన్. రాజు గొర్రెల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఎప్పటి లాగే గొర్రెలను మేపుకొచ్చి గ్రామంలోని కొట్టంలో ఉంచాడు. రాత్రి సమయంలో వీధికుక్కలు దాడి చేసి 48 గొర్రెలను చంపేశాయి. వీటి రూ. 2 లక్షలు ఉంటుందని, సర్కారు ఆదుకోవాలని బాధితుడు కోరాడు. కాగా, స్పాట్‌ను వెటర్నరీ ఆఫీసర్ విజయ్‌కుమార్ పరిశీలించారు.