గచ్చిబౌలి ‘టిమ్స్‌’లో 499 పోస్టులు

గచ్చిబౌలి ‘టిమ్స్‌’లో 499 పోస్టులు

కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్
ఈ నెల 19 వరకు అప్లికేషన్లు

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ ఇ నిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ అండ్‌‌ రీసెర్చ్‌‌ (టిమ్స్‌‌)’లో 499 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలపరిమితి కోసం ఈపోస్టులను భర్తీ చేస్తున్నామని, అంతకుముందే కరోనా తీవ్రత తగ్గితే అప్పటితోనే ఈ పోస్టుల కాల పరిమితి ముగుస్తుందని మెడికల్‌ అండ్‌ హెల్త్‌‌ సర్వీసెస్‌ రిక్రూట్‌‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్లో పేర్కొంది. మంగళవారం నుంచి ఈనెల 19న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తి నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం http://mhsrb.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపింది.

మొత్తం పోస్టుల్లో.. ప్రొఫెసర్లు (14), అసోసియేట్‌ ప్రొఫెసర్లు (24),అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్లు (48), నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ (1), హెడ్‌ నర్స్‌‌ (20), స్టాఫ్ నర్స్‌‌ (246), సీఏఎస్‌ఆర్‌‌ఎంవో(8), మెడికల్‌ ఆఫీసర్లు (121), ఫార్మసీ సూపర్‌‌ వైజర్లు (2), ఫార్మసిస్టులు (12), డైటీషియన్‌‌, బయో మెడికల్‌ ఇంజనీర్‌‌, మెడికల్ రికార్డ్‌‌ ఆఫీసర్‌ పోస్టులు ఒక్కొక్క‌టి చొప్పున ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం

రాష్ట్రంలో కరోనా కేసులు 5,000 దాటినయ్