ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం 

ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం 

ఢిల్లీలో ఇవాళ ఓ భవనం కుప్పకూలింది. ఉత్తర ఢిల్లీలోని శాస్త్రినగర్ లో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో స్థానికులు భయంతో పరుగులుపెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే భవనాన్ని ఖాళీ చేయించటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భవనాన్ని కూల్చాలని గతంలోనే నోటీసులు ఇచ్చామన్నారు. భవనం కూలిపోతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.