భూ కంపంలో వెయ్యి ఇళ్లు ధ్వంసం.. ఐదుగురి మృతి

భూ కంపంలో వెయ్యి ఇళ్లు ధ్వంసం.. ఐదుగురి మృతి

పాపువా న్యూ గినియాలో సంభవించిన భూ కంపం తీవ్ర నష్టాన్ని సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున వచ్చిన ఈ భూకంపలో వెయ్యి కూలిపోయాయి. ధ్వంసం అయ్యాయి. భూ కంపం తీవ్రతకు ఇళ్లు ఊగిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని ఐదుగురు చనిపోయినట్లు ప్రకటించారు అక్కడి అధికారులు. లక్షల మంది నిరాశ్రయులు అయినట్లు చెబుతోంది ప్రభుత్వం.

భూకంప తీవ్రత, నష్టం అంతా నార్త్ భాగంలోనే ఉందని స్థానిక గవర్నర్ అలన్ బర్ట్ ప్రకటించారు. నార్త్ ప్రావిన్స్ లోని చాలా భాగం దెబ్బతిందని.. వందల మంది గాయాలతో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వరదలు వచ్చిన తర్వాత భూకంపం రావటం వల్ల.. సెపిక్ నది పరివాహక ప్రాంతంలో ఇప్పటికీ వందల సంఖ్యలో గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయని.. భూకంపం రోడ్లు దెబ్బతినటంతో.. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని వెల్లడించారు.

భూకంపం తీవ్రత 6.9గా రిక్కర్ స్కేలుపై నమోదైంది. పాపువా న్యూగినియాలో భూకంపాలు సర్వసాధారణం. ఎత్తైన కొండలు, లోతైన సముద్రాలతోపాటు భౌగోళికంగా న్యూగినియా ప్రకృతి ప్రకోపాన్ని తరచూ ఎదుర్కొంటుంది.